ఇంట్రెస్టింగ్.. వెంకీమామ నెక్స్ట్ లో ‘అనిమల్’ ఫేమ్ నటుడు

ఇంట్రెస్టింగ్.. వెంకీమామ నెక్స్ట్ లో ‘అనిమల్’ ఫేమ్ నటుడు

Published on Jul 11, 2024 3:01 PM IST

లేటెస్ట్ గా మన టాలీవుడ్ సీనియర్ హీరో వెంకీ మామ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా ఇప్పుడు అనౌన్స్ అయ్యి షూటింగ్ స్టార్ట్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందదే. మరి ఈ సినిమా నటీనటుల్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎడిషన్ రావడం క్రేజీగా మారింది అని చెప్పాలి.

గత ఏడాది బాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన చిత్రం “అనిమల్” లో హీరో రణబీర్ కపూర్ తో కనిపించిన కొన్ని నిమిషాలు అయినా కూడా ఓ నటుడు అందరి దృష్టి ఆకర్షించాడు. మరి అతనే నటుడు ఉపేంద్ర లిమాయె. వాటే విజన్ వాటే థాట్ అంటూ అదరగొట్టిన తాను ఆ సినిమాతో ఎంతో ఫేమస్ అయ్యారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో అయితే ఎలాంటి రోల్ లో తాను కనిపించనున్నాడో వేచి చూడాలి. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా మేకర్స్ రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు