క్రేజీ టాక్ : రేపు ‘యానిమల్’ ట్రైలర్ గ్రాండ్ రిలీజ్ ?

Published on Nov 16, 2023 10:00 pm IST


బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ యానిమల్. ఈ మూవీ పై అన్ని భాషల ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. కాగా ఈ పాన్ ఇండియన్ మూవీని భద్రకాళి పిక్చర్స్, టి సిరీస్ ఫిలిమ్స్, సినీ వన్ స్టూడియోస్ బ్యానర్స్ కలిసి గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాయి.

ఇప్పటికే యానిమల్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై అంచనాలు మరింతగా పెంచేసాయి. కాగా మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని రేపు దుబాయ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనుండగా దానిని ప్రముఖ ఎత్తైన బిల్డింగ్ అయిన బుర్జ్ ఖలీఫా పై ప్రదర్శించనున్నారట. అయితే దీనికి సంబంధించి మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. కాగా యానిమల్ మూవీ డిసెంబర్ 1న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం :