ప్రస్తుతం బాలీవుడ్ సినిమా మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూస్తున్న భారీ చిత్రం “యానిమల్” కోసం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు సాలిడ్ ప్రమోషన్స్ లో వరల్డ్ వైడ్ గా అయితే చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మేకర్స్ ఆల్రెడీ మన తెలుగులో కూడా గట్టిగా ప్లాన్ చేస్తుండగా ప్రస్తుతం జరుగుతున్నా క్రికెట్ వరల్డ్ కప్ కి కూడా వెళ్ళబోతున్నారు.
మరి రేపు వాంఖడే స్టేడియం లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమిస్ మ్యాచ్ కి అయితే రణబీర్ తాను వెళ్తున్నట్టుగా తెలిపాడు. మరి ఇండియన్ జెర్సీ లో నెంబర్ 1 తో తాను దిగిన ఫోటోలు కొన్ని ఇప్పుడు వైరల్ గా కూడా మారాయి. దీనితో ప్రమోషన్స్ విషయంలో మాత్రం మేకర్స్ మంచి ప్లానింగ్ లో వెళ్తున్నారని చెప్పాలి. ఇక ఈ అవైటెడ్ చిత్రం ఈ డిసెంబర్ 1న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది.