జూన్ 14న అనిరుధ్ ‘కిరాక్’ ఆడియో

Kiraak
యు ట్యూబ్ ద్వారా షార్ట్ ఫిల్మ్ ప్రపంచంలో తన నటనతో, పవన్ కళ్యాణ్ ని బాగా ఇమిటేట్ చేస్తూ పేరు తెచ్చుకున్న అనిరుధ్ హీరోగా వెండి తెరకు పచయమవుతూ చేసిన సినిమా ‘కిరాక్’. హారిక్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ లవ్ ఎంటర్టైనర్ లో అనిరుధ్ సరసన చాందిని హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియోని జూన్ 14న లాంచ్ చేయడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేసింది.

సింగల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసిన ఈ సినిమా రొటీన్ సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని డైరెక్టర్ హారిక్ అన్నాడు. గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అజయ్ అరసాద మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. షార్ట్ ఫిల్మ్ ద్వారా మెప్పించిన హారిక్ ఈ సినిమాతో ఎంతవరకూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తాడు అనే దానికోసం కొంతకాలం వేచి చూడాల్సిందే..

Exit mobile version