ఆడియో వేడుకలో అనిరుద్ లైవ్ పెర్ఫార్మన్స్ !

పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అజ్ఞాతవాసి ఆడియో సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. రేపు జరగబోయే ఈ సినిమా ఆడియో వేడుకను భారీగా ప్లాన్ చేసారు. అతిరథ మహారధులు పాల్గొనబోయే ఈ వేడుకను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలిరానున్నారు. ఈ ఫంక్షన్ పాసేస్ కోసం ఫ్యాన్స్ పోటిపడుతున్నారు.

రేపు సాయంత్రం హైదరాబాద్ లో జరగబోయే ఈ వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వబోతున్నాడు. దాదాపు గంట పాటు అనిరుద్ ప్రేక్షకులను అలరించబోతున్నాడని సమాచారం. పవన్ 25 వ చిత్ర ఆడియో వేడుక కావడం తో ఈ ఫంక్షన్ పై క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాలో మిగిలిఉన్న నాలుగు పాటలు రేపు విడుదల కానున్నాయి.