డీజే టిల్లు కోసం అనిరుధ్ రవి చందర్…సెకండ్ సింగిల్ త్వరలో విడుదల

డీజే టిల్లు కోసం అనిరుధ్ రవి చందర్…సెకండ్ సింగిల్ త్వరలో విడుదల

Published on Jan 22, 2022 1:07 AM IST


సిద్దు, నేహా శెట్టి, ప్రిన్స్ సిసిల్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం డీజే టిల్లు. విమల్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పిడివి ప్రసాద్ సమర్పణ లో సితార ఎంటర్ టైన్మెంట్ పతాకం పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదల అయ్యి ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి రెండవ సింగిల్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల మరియు రామ్ మిరియాల సంగీతం అందిస్తున్నారు. ఈ రెండవ సింగిల్ కోసం ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవి చందర్ ను బరిలోకి దింపడం జరిగింది. శ్రీ చరణ్ పాకాల కంపోజ్ చేస్తుండగా, అనిరుధ్ పాడనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు