ది ప్యారడైజ్ : ఆ ఒక్కదానిపైనే రిలీజ్ భారం..!

The-Paradise

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’పై ఇండస్ట్రీలో రోజుకో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ సినిమాను తొలుత వేసవి కానుకగా విడుదల చేయాలని భావించినప్పటికీ, షూటింగ్‌లో ఆలస్యం కారణంగా ఈ సినిమాను ఆగస్టు 21, 2026కు వాయిదా వేశారు. ప్రస్తుతం షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నప్పటికీ, ఆగస్టు నాటికి సినిమా సిద్ధమవుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన మొదటి పాట ‘ఆయా షేర్’ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించగా, సినిమాలోని రెండో సింగిల్ మే నెలలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే, ఈ సినిమాను ఈసారైనా అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తారా అనే విషయంపై డైలమా నెలకొంది. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనుకున్న సమయంలో పూర్తి చేస్తేనే ‘ది ప్యారడైజ్’ చెప్పిన డేట్‌కు వస్తుందని తెలుస్తోంది.

అనిరుధ్ చేతిలో ప్రస్తుతం అనేక భారీ ప్రాజెక్టులు ఉండటం, ఆయన క్వాలిటీ కోసం ఎక్కువ సమయం తీసుకుంటాడనే పేరుండటం తో ఈ చిత్ర టీం కాస్త ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. షూటింగ్ మొత్తాన్ని మే నెల చివరి నాటికి పూర్తి చేస్తేనే, అనిరుధ్ బీజీఎంపై ఫోకస్ పెడతాడని.. ఒకవేళ షూటింగ్ ఇంకా ఆలస్యమైతే, అనిరుధ్ డేట్స్ సర్దుబాటు కాక సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ది ప్యారడైజ్ రిలీజ్ విషయంలో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Exit mobile version