తెలుగు ప్రేక్షకులకు అనిరుద్ కృతజ్ఞతలు !

13th, December 2017 - 06:57:48 PM

అజ్ఞాతవాసి సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జ‌రుపుకుంటోంది.జనవరి 10 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి “బయటకొచ్చి చూస్తే” పాటను త్రివిక్రమ్ పుట్టినరోజున విడుదల చేసారు. ఆ పాటకి మంచి స్పందన వచ్చింది. అలాగే రెండో పాట “గాలి వాలుగా” విడుదల అయ్యింది ఈ పాట కూడా బాగా పాపులర్ అయ్యింది.

ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు. విడుదలైన రెండు పాటలను ప్రేమించి మనస్ఫూర్తిగా తియ్యని తెలుగు ప్రపంచంలోకి నన్ను స్వాగతించిన సంగీత ప్రియులకు మరియు తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఈ సందేశాన్ని తెలుగులో పోస్ట్ చెయ్యడం విశేషం. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం ప్లస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.