స్టార్ హీరోతో హ్యాట్రిక్ సినిమాకి సైన్ చేసిన అనిరుద్ !

8th, January 2018 - 08:41:26 AM

తమిళ టాప్ సంగీత దర్శకుల్లో ఒకరైన అనిరుద్ రవిచంద్రర్ భారీ ఆఫర్లతో దూసుకుపోతున్నారు. పెద్ద హీరోలు, స్టార్ డైరెక్టర్లు ఈ యువ కంపోజర్ వైపే మొగ్గుచూపుతున్నారు. తాజాగా స్టార్ హీరో అజిత్ త్వరలో శివ దర్వకత్వంలో చేయనున్న ‘విశ్వాసం’ సినిమాకి అనిరుద్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు.

అనిరుద్ గతంలో అజిత్, శివలు కలిసి చేసిన సూపర్ హిట్ సినిమాలు ‘వివేకం, వేదాళం’ లకు బ్రహ్మాండమైన సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఈ హిట్ కాంబో మూడోసారి రిపీట్ కానుండటంతో ప్రేక్షకులు, అభిమానుల్లో అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ జనవరి 19 నుండి మొదలుకానుంది. ఇకపోతే అనిరుద్ సంగీతం అందించిన ‘అజ్ఞాతవాసి, గ్యాంగ్’ సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి.