బాలయ్య సినిమాలో విలన్ గా తెలుగు హీరోయిన్?

Published on Jun 6, 2022 7:02 am IST


సక్సె స్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్య బాబుతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో మరో తెలుగు హీరోయిన్ కీలక పాత్రలో నటిచబోతుంది. హీరోయిన్ అంజలి బాలయ్య సరసన ఓ ముఖ్య పాత్రలో కనిపంచనుంది. అయితే ఆమెది హీరోయిన్ పాత్ర కాదు అని, విలన్ పాత్ర అని టాక్ నడుస్తోంది. హీరోయిన్ శ్రీలీల కూడా బాలయ్యకి కూతురిగా ఈ సినిమాలో నటిస్తోంది. ఇక జులై ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.

కాగా ఈ సినిమాలో మరో హీరో కూడా నటిస్తాడని.. అది రవితేజనే అని గతంలో వార్తలు వచ్చాయి. రవితేజ పాత్ర ఇంటర్వెల్ లో వస్తోందట. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సీరియస్ గా సాగుతూ.. ఇంటర్వెల్ కి సినిమా ఫుల్ కామెడీగా టర్న్ అవుతుందని తెలుస్తోంది. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో వరుస విజయాలను అందుకుంటున్నాడు అనిల్ రావిపూడి. అందుకే, అనిల్ – బాలయ్య కలయికలో సినిమా అనగానే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

సంబంధిత సమాచారం :