యువ దర్శకుడు కర్రి బాలాజీ దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్రధారిగా ఆనందభైరవి చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాలో లక్ష్మీరాయ్ ప్రత్యేక పాత్ర పోషించనున్నారు. ఓ యువ కథానాయకుడు ఈ సినిమాలో అంజలికి జోడిగా నటించనున్నారు. హరేవన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రమేశ్‌రెడ్డి ఇటికెల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
కాగా సరికొత్త పాయింట్‌తో, భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకొనే ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్లో ప్రారంభం కానుంది. ఈ సినిమా గురించి నిర్మాత రమేశ్‌రెడ్డి ఇటికేల మాట్లాడుతూ దర్శకుడు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. డిసెంబర్లో లాంఛనంగా షూటింగ్ ప్రారంభిస్తాం. జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది అని తెలిపారు.
అంజలి మాట్లాడుతూ.. ‘దర్శకుడు బాలాజీగారు చెప్పిన కథ నచ్చి ఈ సినిమా చేస్తున్నాను. తొలిసారిగా యాక్షన్ పాత్ర పోషిస్తున్నాను. సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాను అని చెప్పారు.
రవికిషన్, బాహుబలి ప్రభాకర్, ధన్‌రాజ్, సత్యం రాజేశ్, ఆశిష్ విద్యార్ధి, బ్రహ్మాజీ, శ్రీహర్ష తదితరులు నటించే ఈ చిత్రానికి స్ర్కిప్ట్ కో-ఆర్డినేటర్ : మధు విప్పర్తి, సంగీతంః మణిశర్మ, ఛాయాగ్రహణంః పి.జి.విందా, ఎడిటింగ్ః చోటా కె. ప్రసాద్, నిర్మాతః రమేశ్‌రెడ్డి ఇటికేల, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వంః కర్రి బాలాజీ.