అంజలి, లక్ష్మి రాయ్ ప్రధాన పాత్రల్లో సినిమా !

16th, December 2017 - 11:42:21 AM

గుంటూరు టాకీస్, రాజా మీరు కేక వంటి సినిమాలు నిర్మించిన ఆర్‌కె స్టూడియోస్ బ్యానర్ పై ఎమ్. రాజ్‌కుమార్ నిర్మాత‌గా హీరోయిన్స్ అంజలి, లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రల్లో కొన్ని య‌దార్థ సంఘ‌ట‌నల ఆధారంగా తెరకేక్కబోయే సినిమాకు కర్రి బాలాజీ దర్శకత్వం వహించబోతున్నారు. డిఫరెంట్ కథాంశం తో తెరకెక్కబోయే ఈ సినిమాలో వినోదం తో పాటు ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే ఉండబోతోంది.

ఈ సినిమాను తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ కి సంభందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సాయి కుమార్, న‌రేష్ ప్రదాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అలాగే పి.జి విందా సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.