‘పుష్ప’ ట్రైలర్ కి రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ?

Published on Nov 29, 2021 11:07 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న సినిమా ‘పుష్ప’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. డిసెంబర్ 6వ తేదీన పుష్ప ట్రైలర్ రిలీజ్ కాబోతుంది అంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర లో పక్కా ఊర మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు.

కాగా ఇప్పటికే పుష్ప చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలా నటిస్తోంది. అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ సినిమాలో ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. పుష్ప సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :