అన్నాత్తే ఫస్ట్ సింగిల్ కి ముహూర్తం ఖరారు!

Published on Oct 4, 2021 6:59 am IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తీ సురేష్ లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్న తాజా చిత్రం అన్నాత్తే. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం నుండి వరుస అప్డేట్స్ షురూ అయ్యాయి. ఇటీవల విడుదల అయిన ఫస్ట్ లుక్ కి అద్భుత రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ను రేపు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది.

అయితే ఈ పాటను ప్రముఖ లెజెండరీ సింగర్, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత అయిన ఎస్పీ బాలు పాడినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. రేపు సాయంత్రం ఈ పాటను 6 గంటలకు విడుదల చేస్తున్నట్లు తెలిపింది. జాకీ ష్రాఫ్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, వేళ రామ్మూర్తి, సతీశ్, సూరి లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :