“అన్నాత్తే” టీజర్ కి ముహూర్తం ఫిక్స్!

Published on Oct 12, 2021 2:09 am IST


సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అన్నాత్తే. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. డి. ఇమ్మన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శివ మరియు ఆది నారాయణ కథ ను అందిస్తున్నారు. సవరీ ముత్తు, శివ, ఆంటోనీ భాగ్యరాజ్, చంద్రన్ పచైముత్తులు డైలాగ్స్ అందిస్తున్నారు.

ఈ చిత్రం కోసం ప్రేక్షకులు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ చిత్రం టీజర్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం టీజర్ ను అక్టోబర్ 14 వ తేదీన సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. అంతేకాక ఈ చిత్రాన్ని నవంబర్ 4 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :