రేపు విడుదల కానున్న రజినీకాంత్ “అన్నాత్తే” ట్రైలర్

Published on Oct 26, 2021 8:56 pm IST


సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అన్నాత్తే. మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తీ సురేష్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. డి. ఇమ్మన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ను నవంబర్ 4 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, పాటలు, విడియోలు సినిమా పై ఆసక్తి రేకెత్తించే విధంగా ఉన్నాయి. ఈ చిత్రం నుండి ట్రైలర్ ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు ఒక అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది.

సంబంధిత సమాచారం :