వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “అన్నపూర్ణ ఫోటో స్టూడియో”

Published on Sep 26, 2023 1:25 pm IST

చైతన్య రావు మదడి మరియు లావణ్య సహుకర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి డీసెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది. ఈ సినిమా ప్రముఖ టీవీ ఛానల్ అయిన ఈటీవీ తెలుగు లో అక్టోబర్ 1, 2023 న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించనుంది. సాయంత్రం 6:30 గంటలకు ప్రసారం కానుంది.
చెందు ముద్దు రచన మరియు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యశ్ రంగినేని నిర్మించారు. ప్రిన్స్ హెన్రీ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :