వీరభద్రుడు : సూర్య సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘కరుప్పు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సూర్య ఊరమాస్ అవతారంలో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. అయితే, ఈ సినిమాను తెలుగులో ‘వీరభద్రుడు’ అనే టైటిల్‌తో రిలీజ్ చేయనున్నారు.

ఈ చిత్రాన్ని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లు ప్రకిటించింది. ఈ సినిమాలో స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. సూర్య-త్రిష కాంబోపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో ఈ సినిమాను తెలుగులో చూసేందుకు ఇక్కడి ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు.

సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తు్న్న ఈ సినిమాను మే 14, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటరాజ్, ఇంద్రాన్స్, స్వసిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version