“అన్నీ మంచి శకునములే” టీవీ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్!

Published on Sep 17, 2023 5:39 pm IST

టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అన్నీ మంచి శకునములే. స్వప్న సినిమా మరియు మిత్రవింద మూవీస్ బ్యానర్ లపై ప్రియాంక దత్ నిర్మించిన ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో విఫలం అయ్యింది. అయితే ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర పై అలరించడానికి రెడీ అయిపోయింది.

వచ్చే ఆదివారం ఈ సినిమా ప్రముఖ టీవీ ఛానల్ అయిన జీ తెలుగు లో మధ్యాహ్నం 12:30 గంటలకి ప్రసారం కానుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :