పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజీ. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ను అనౌన్స్ చేసిన మొదటి రోజు నుండే ఇండస్ట్రీ లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కి సంబందించిన టీజర్ ను మేకర్స్ రేపు ఉదయం 10:35 గంటలకి రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని నిన్న మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.
ఇదే హైప్ ను కంటిన్యూ చేస్తున్నారు మేకర్స్. మరొక 24 గంటల్లో హంగ్రీ చీతా ఎంట్రీ అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం లో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Countdown… 24 hours… ????????????????????#HUNGRYCHEETAH #TheyCallHimOG
— DVV Entertainment (@DVVMovies) September 1, 2023