కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ రాయన్. ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ మెంట్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఆడియెన్స్ నుండి, ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం లో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్.జే. సూర్య, ప్రముఖ డైరెక్టర్ సెల్వ రాఘవన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నేడు ఈ చిత్రం నుండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ వెల్లడించారు.
ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదే విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. ఇంట్రెస్టింగ్ కాస్టింగ్ తో సినిమా హాట్ టాపిక్ గా మారుతోంది. సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ అయిన రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Introducing @prakashraaj from the world of #Raayan ????@dhanushkraja @arrahman @iam_SJSuryah @selvaraghavan @kalidas700 @sundeepkishan @omdop @editor_prasanna @PeterHeinOffl @jacki_art @kavya_sriram @kabilanchelliah @theSreyas @RIAZtheboss pic.twitter.com/BxvNnP3BO5
— Sun Pictures (@sunpictures) February 23, 2024