“సర్కారు వారి పాట” నుంచి మరో అవైటెడ్ అప్డేట్ రాబోతోందా?

Published on Apr 7, 2022 7:04 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మరియు మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట”. మహేష్ కెరీర్ లోనే ఒక 2.0 లా కొత్త రకం మహేష్ ని ప్రెజెంట్ చేస్తూ వస్తున్న ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు.

మరి ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు సూపర్ హిట్ సాంగ్స్ వచ్చి సాలిడ్ హిట్ కాగా థమన్ నుంచి మూడో సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సాంగ్ కి సంబంధించి అనౌన్సమెంట్ అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉన్నట్టు సినీ వర్గాల్లో బజ్ వినిపిస్తుంది.

అసలుకి అయితే ఈ ఉగాదికే అప్డేట్ రావాల్సి ఉంది కానీ మేకర్స్ అప్పుడు ఒక ఇంటెన్స్ పోస్టర్ ని గిఫ్ట్ గా అందించారు. మరి ఈ నెక్స్ట్ అవైటెడ్ అప్డేట్ ఎప్పుడు రానుందో చూడాలి. మరి ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మే 12న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :