పవన్ కళ్యాణ్ “వకీల్‌సాబ్” ఖాతాలో మరో అవార్డ్..!

Published on Mar 15, 2022 2:10 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మించిన సినిమా “వకీల్ సాబ్”. గత ఏడాది ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకుంది. కలెక్షన్ల పరంగా, రికార్డుల పరంగా కూడా సెన్సేషన్‌ని నమోదు చేసుకున్న ఈ చిత్రం తాజాగా ఓ అవార్డుని గెలుచుకుంది.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు చేసిన మార్కెటింగ్ క్యాంపెయిన్ కి ఇండియన్ మార్కెటింగ్ అవార్డ్స్‌లో జీ తెలుగు ఉత్తమ అనుభవపూర్వక మార్కెటింగ్ కేటగిరిలో బ్రోన్జ్ అవార్డ్‌ని గెలుచుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్ల, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

సంబంధిత సమాచారం :