లేటెస్ట్..”కేజీయఫ్” నిర్మాణ సంస్థ నుంచి మరో బిగ్ అనౌన్సమెంట్.!

Published on Apr 26, 2022 2:00 pm IST

తాజాగా ఇండియన్ సినిమా దగ్గర భారీ వసూళ్లతో అదరగొడుతున్న సినిమా “కేజీయఫ్ చాప్టర్ 2”. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ వారు భారీ వ్యయంతో నిర్మాణం వహించి భారీ హిట్ ని స్కోర్ చేశారు.

అయితే ఈ సినిమా సక్సెస్ తోనే వీరి బ్యానర్ పేరు ఇండియా వైడ్ గట్టిగా వినిపించగా రీసెంట్ గానే వీరు కొన్ని బిగ్ అనౌన్సమెంట్స్ ని అందించారు. ఇక ఇదిలా ఉండగా ఇపుడు ఇదే నిర్మాణ సంస్థ నుంచి మరో భారీ అనౌన్సమెంట్ ని అందిస్తున్నట్టుగా తెలుపుతున్నారు.

సిల్వర్ స్క్రీన్ పై ఒక కొత్త అధ్యాయం అంటూ దీనిని రేపు ఏప్రిల్ 27న ఉదయం 9 గంటల 50 నిమిషాలకి రివీల్ చేస్తున్నట్టు తెలిపారు. మరి ఈ సాలిడ్ అనౌన్సమెంట్ ఏంటో వేచి చూడాలి. ప్రస్తుతం అయితే వీరి సినిమా వసూళ్లతో 1000 కోట్లకి చేరువలో ఉంది.

సంబంధిత సమాచారం :