“సంక్రాంతికి వస్తున్నాం” నుంచి మరో బిగ్ ట్రీట్!

“సంక్రాంతికి వస్తున్నాం” నుంచి మరో బిగ్ ట్రీట్!

Published on Jan 19, 2025 4:57 PM IST

లేటెస్ట్ గా సంక్రాంతి కానుకగా వచ్చిన టాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” కూడా ఒకటి. వెంకీ మామ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన చిత్రంని దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించగా వెంకీ మామ కెరీర్ లోనే సెన్సేషనల్ హిట్ అయ్యి రికార్డు వసూళ్లు నమోదు చేస్తుంది.

అయితే ఈ సినిమా సక్సెస్ ని మేకర్స్ అంతా ఎంజాయ్ చేస్తుండగా లేటెస్ట్ గా దర్శకుడు నుంచి ఈ సినిమాకి కూడా సీక్వెల్ పై ఓ క్రేజీ హింట్ వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం కి సీక్వెల్ చేస్తున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ చేశారు. అయితే ఎఫ్ 2 తర్వాత ఎఫ్ 3 ఎలాగో దీనిని కూడా కొత్త పరిస్థితులతో ప్లాన్ చేసేలా తెలిపారు. దీనితో ఈ క్రేజీ సీక్వెల్ కూడా లైన్ లో ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు