2012లో వచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రంతో తెలుగు పరిశ్రమకు గుడ్ బై చెప్పి బాలీవుడ్ వెళ్లిపోయిన గోవా బ్యూటీ ఇలియాన ఈ ఏడాది తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె రవితేజ చేస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో కథానాయకిగా నటిస్తోంది.
ఈ సినిమాతో పాటు ఆమెకు మరొక పెద్ద సినిమాలో కూడ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ పెద్ద ప్రాజెక్ట్ ఏంటి, అందులో హీరో ఎవరు, దానికి నిర్మాత, దర్శకుడు ఎవరు ఆనేరు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీన్నిబట్టి ఇలియానకు తెలుగునాట ఇంకా డిమాండ్ తగ్గలేదని అర్థమవుతోంది. ఇకపోతే ఈమె నటిస్తున్న రవితేజ చిత్రాన్ని శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్నారు.
