‘సాహో’ కోసం మరో బాలీవుడ్ నటుడు !
Published on Jul 24, 2017 10:54 am IST


‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న ‘సాహో’ చిత్రం పట్ల అన్ని పరిశ్రమల ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొని ఉంది. ఈ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ‘బాహుబలి’ తో బాలీవుడ్లో ప్రభాస్ కు ఏర్పడిన భారీ మార్కెట్ పై శ్రద్దపెట్టిన చిత్ర యూనిట్ అక్కడి ప్రేక్షకులకు లోకల్ సినిమా అనే ఫీలింగ్ కలిగేలా బాలీవుడ్ నటుల్ని ప్రాజెక్టులోకి తీసుకుంటోంది.

ఇప్పటికే ప్రధాన ప్రతినాయకుడిగా ‘కత్తి’ ఫేమ్ నీల్ నితిన్ ముఖేష్ ను తీసుకోగా తాజాగా మరో బాలీవుడ్ హీరోను సినిమాలోకి తీసుకుంది. అతనే చుంకి పాండే. హీరోగా పలు హిట్ సినిమాల్లో నటించిన చుంకీ పాండే ‘సాహో’ లో ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడట. ఇకపోతే యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో ప్రభాస్ కు జోడీ ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

 
Like us on Facebook