దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు కలయికలో రాబోతున్న సినిమా ‘వారణాసి’. ప్రస్తుతం హైదరాబాద్‌లో సిద్ధం చేసిన ప్రత్యేక సెట్‌లో మహేశ్, ప్రియాంక, పృథ్వీరాజ్‌లపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక ఈ సినిమాలో మందాకినిగా కనిపిస్తూ ఉండగా.. మహేశ్ రుద్రగా.. శ్రీరాముడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఐతే, ప్రస్తుతం చేస్తున్న సీన్స్ ‘రుద్ర – మందాకిని’లకు సంబంధించినవి అని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ అనంతరం.. ఓ సాంగ్ ను షూట్ చేయనున్నారు. ఇది ప్రత్యేక పాట అని, ఈ పాటలో మహేశ్ సరసన మరో బాలీవుడ్ బ్యూటీ కనిపిస్తోందని టాక్. మరి ఈ సాంగ్ ఎంత గ్రాండ్ గా ఉండబోతుందో చూడాలి.
అన్నట్టు ‘వారణాసి’ చిత్రం రూ.1300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. కాగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను కెఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తుండగా, కథా కథనాన్ని విజయేంద్ర ప్రసాద్ రూపొందించారు. ఇక ఈ సినిమాకి దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు. ఈ సినిమాను పూర్తిగా IMAX ఫార్మాట్లో చిత్రీకరిస్తుండగా, పలు భాషల్లో విడుదల చేయనున్నారు.
