టాక్..బాలయ్య కోసం మరో బాలీవుడ్ హీరోయిన్.?

Published on Jul 29, 2022 3:55 pm IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మనినేనితో అలాగే శృతి హాసన్ హీరోయిన్ గా తన కెరీర్ లో 107వ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమా షూటింగ్ లో ఉన్న బాలయ్య తన కెరీర్ లో బెస్ట్ లైనప్ తో ఇప్పుడు ఉన్నారని కూడా చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత దర్శకుడు అనీల్ రావిపూడి తో ఓ పక్కా మాస్ ఎంటర్టైనర్ చేయనున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా పైనే లేటెస్ట్ గా కొన్ని ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటి ప్రకారం అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ని అనుకుంటున్నటుగా టాక్ బయటకి వచ్చింది. మరి ఆ హీరోయిన్ సోనాక్షి సిన్హా అని తెలుస్తుంది. అయితే మరో గతంలో బాలీవుడ్ హీరోయిన్ బాలయ్య విద్య బాలన్ తో నటించిన సంగతి తెలిసిందే. మరి ఒకవేళ నెక్స్ట్ సినిమా టాక్ నిజం అయితే మాత్రం మరో బాలీవుడ్ హీరోయిన్ తో నటించినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :