టాక్..పవన్ “వీరమల్లు” మరో బాలీవుడ్ స్టార్ నటి.?

Published on Apr 24, 2022 10:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ భారీ సినిమాల్లో తన కెరీర్ లోనే మోస్ట్ అవైటెడ్ మరియు ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ అయినటువంటి చిత్రం “హరిహర వీరమల్లు” ముఖ్యమైనది. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో చేస్తున్న ఈ సినిమా ఓ రేంజ్ తెరకెక్కుతుంది. అలాగే పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా రీసెంట్ గానే మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసుకోగా లేటెస్ట్ గా మరో టాక్ ఈ సినిమాపై వినిపిస్తుంది.

ఈ సినిమాలో ఆల్రెడీ బాలీవుడ్ కి చెందిన నటి నపూర్ సనన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే కాగా ఇప్పుడు మరో స్టార్ నటి నోరా ఫతేహి కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్టు టాక్. మరి దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం ఇస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :