బిగ్ బాస్ 6: పెర్ఫార్మెన్స్ లేకపోతే ఎలిమినేషన్ తప్పదా?

Published on Sep 26, 2022 3:05 pm IST

బిగ్ బాస్ 6 గత రెండు వారాల్లో కొన్ని షాకింగ్ ఎలిమినేషన్‌ లను చూస్తోంది. నిన్న నేహా చౌదరి ఎలిమినేట్ అయింది. ఆమె చాలా పాపులర్ యాంకర్ మరియు చాలా కాలంగా పరిశ్రమలో ఉంది. కాబట్టి, సహజంగానే, ఆమె నుండి ఈ షో లో చాలా ఆశించబడింది. కానీ పాపం, ఆమె షో నుండి ఎలిమినేట్ అయ్యింది.

నేహా మొదటి రోజు నుండే పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా ఆమె ఆట గురించి ముందుగానే హెచ్చరించాడు. నేహా తన ఆటను మెరుగుపరుచుకుంటానని తెలిపింది. ఏదేమైనా ఎలిమినేట్ అవ్వడం పట్ల షో మున్ముందు ఎలా కొనసాగుతుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా పెర్ఫార్మెన్స్ బాగోలేక పోతే ఎలిమినేట్ కావడం ఖాయం అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :