రవితేజ “ఖిలాడి” నుండి మరొక పాత్రను పరిచయం చేసిన టీమ్!

Published on Feb 3, 2022 5:13 pm IST


రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ క్రైమ్ చిత్రం ఖిలాడి. ఈ చిత్రం లో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. పెన్ స్టూడియోస్ మరియు ఏ స్టూడియోస్ పతాకాల పై ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు మరియు రమేష్ వర్మ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా గతేడాది విడుదల కావాల్సి ఉండగా, కరోనా వైరస్ తీవ్రత కారణంగా వాయిదా పడింది.

ఈ చిత్రం లో నటిస్తున్న పలు కీలక పాత్రలకు సంబంధించి చిత్ర యూనిట్ గత కొద్ది రోజులుగా పాస్టర్ లను విడుదల చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుండి మరొక పాత్ర కి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. అనూప్ సింగ్ ఈ చిత్రం లో డేవిడ్ పాత్ర లో నటిస్తున్నారు. మీనాక్షి చౌదరీ, డింపుల్ హయాతీ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ సర్జా మరియు ఉన్ని ముకుందన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ను ఫిబ్రవరి 11 వ తేదీన థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :