షారుఖ్, అట్లీల బిగ్ ప్రాజెక్ట్ పై మరో క్రేజీ బజ్..!

Published on Sep 11, 2021 10:55 am IST

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మంచి క్రేజ్ లో ఉన్న పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరియు కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ప్లాన్ చేసిన చిత్రం భారీ పాన్ ఇండియన్ సినిమా కూడా ఒకటి. మరి జస్ట్ కొన్ని రోజుల కితమే స్టార్ట్ అయ్యిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్ పలు కీలక సన్నివేశాలను పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మరో క్రేజీ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది.

ఇన్ని రోజులు ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తాడని బజ్ వినిపించింది. కానీ ఇప్పుడు ఈ రేస్ లో మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ పేరు వచ్చింది. ఇది వినడానికి మంచి ఆసక్తికరంగా ఉంది కానీ ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. సౌత్ లో అనిరుద్ మ్యూజిక్ కి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసందే. అది షారుఖ్ కనుక పడితే సినిమా ఇంకో లెవెల్లో ఉండొచ్చు మరి ఇది ఎంత వరకు నిజమో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :