టాక్..మరో క్రేజీ క్యామియోతో ‘లోకి’ యూనివర్స్..?

టాక్..మరో క్రేజీ క్యామియోతో ‘లోకి’ యూనివర్స్..?

Published on Nov 18, 2022 4:00 PM IST

రీసెంట్ గా సౌత్ ఇండియన్ సినిమా దగ్గర తన సినిమాతో మూవీ లవర్స్ కి అద్దిరిపోయే ట్రీట్ ఇచ్చిన దర్శకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగ్ రాజ్ అనే చెప్పాలి. తన సినిమాలు అప్పుడు వరకు బాగుండేవి అనే నాటి నుంచి ఇక లోకేష్ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయి అనే చర్చ స్టార్ట్ అయ్యింది.

తన సినిమాలకి అంటూ ఓ సెపరేట్ యూనివర్స్ క్రియేట్ చేసి ఓ సినిమా పత్రాలు మరో సినిమాలో చూపిస్తూ ఓ స్పెషల్ ట్రీట్ ని తన “విక్రమ్” సినిమా నుంచి స్టార్ట్ చేసాడు. ఇక అక్కడ నుంచి తన లైనప్ పై అటు తమిళ్ తో పాటుగా మన టాలీవుడ్ ఆడియెన్స్ కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా నెక్స్ట్ అయితే లోకేష్ ఇళయ దళపతి విజయ్ తో చేయనున్నాడు.

మరి ఇది కూడా లోకి యూనివర్స్ లో భాగమా కాదా అనే టాక్ చాలా ఆసక్తిగా మారగా ఇప్పుడు క్రేజీ టాక్ కోలీవుడ్ సినీ వర్గాల నుంచి వినిపిస్తుంది. ఇప్పుడు విజయ్ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ సాలిడ్ క్యామియో రోల్ పాజిబుల్ ఉన్నట్టుగా కోలీవుడ్ లో స్టార్ట్ అయ్యిన లేటెస్ట్ టాక్. మరి ఇది కానీ నిజం అయితే ఈ సినిమా నుంచి మామూలు ట్రీట్ ఉండదని చెప్పొచ్చు. మరి ఇందులో ఎంతమేర నిజం ఉంది అనేది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు