హిట్ కాంబినేషన్ నుంచి మరో క్రేజీ సినిమా ?

హిట్ కాంబినేషన్ నుంచి మరో క్రేజీ సినిమా ?

Published on Nov 28, 2022 7:03 AM IST

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ – బన్నీ కాంబినేషన్ లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురంలో’. ఈ మూడు సూపర్ హిట్ అయ్యాయి. అందుకే, ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ కాంబినేషన్ పై మరో సినిమా చేయనున్నాడని గతంలోనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ బాబుతో సినిమా పూర్తి అయిన తర్వాత, త్రివిక్రమ్ బన్నీతోనే సినిమాని ప్లాన్ చేస్తున్నాడని.. 2023 సమ్మర్ తర్వాత ఈ సినిమా మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

సమ్మర్ లో స్టార్ట్ చేసి.. 2024 సంక్రాంతికి టార్గెట్ గా చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక బన్నీ – త్రివిక్రమ్ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించబోతుందని తెలుస్తోంది. అన్నట్టు గతంలోనే బన్నీకి త్రివిక్రమ్ ఓ కథ చెప్పాడని, ఆ కథనే ఇప్పుడు సినిమాగా చేయాలనుకుంటున్నాడట. ఏది ఏమైనా బన్నీ – త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే.. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు