“సర్కారు వారి పాట” నుంచి మరో సాలిడ్ ట్యూన్ అప్పుడే.?

Published on Apr 21, 2022 6:19 pm IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” కోసం తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ క్రేజీ మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఒక్కో సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు.

మరి అభిమానులు ఎదురు చూస్తున్న అవైటెడ్ టైటిల్ ట్రాక్ లాంచ్ కి గాను మేకర్స్ డేట్ అండ్ టైం ని ఫిక్స్ చెయ్యగా ఇప్పుడు దీని తర్వాత మరో మాస్ సాంగ్ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం అయితే ఈ మే 1న రిలీజ్ చెయ్యనున్నట్టు తెలుస్తుంది.

మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి థమన్ ఆల్రెడీ చార్ట్ బస్టర్ నంబర్స్ ఇవ్వగా ఈ సాంగ్స్ పై మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వచ్చే మే 12న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :