“తగ్గేదే లే” అంటున్న మరొక క్రికెటర్

Published on Jan 31, 2022 5:40 pm IST

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప ది రైజ్. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ నటన పై సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అల్లు అర్జున్ డాన్స్ కి మరియు ఇందులో చెప్పిన డైలాగ్స్ కి విపరీతమైన క్రేజ్ వస్తోంది. ఈ చిత్రం లో తగ్గేదే లే అనే ఒక్క డైలాగ్, ఆ ఒక్క మూమెంట్ ప్రతి ఒక్కరినీ కట్టి పడేస్తుంది.

తాజాగా సౌత్ ఆఫ్రికా కి చెందిన క్రికెటర్ కామెరాన్ డెల్పోట్ తమ అర్థ సెంచరీ అనంతరం తగ్గేదే లే మూమెంట్ ను ప్రదర్శించడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అభిమానులు సైతం అల్లు అర్జున్ కి వస్తున్న క్రేజ్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం లో రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్ ఘోష్, ఫాహద్ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం కి సంబంధించిన రెండవ భాగం పుష్ప ది రూల్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :