“ఆదిపురుష్” పై మరో డిజప్పాయింటింగ్ న్యూస్.?

“ఆదిపురుష్” పై మరో డిజప్పాయింటింగ్ న్యూస్.?

Published on Jul 5, 2022 10:00 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం చేస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని మేకర్స్ ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చెయ్యగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.

అయితే ఈ సినిమా విషయంలో మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆత్రుతగానే ఉన్నారు. ఇంకా ఒక ఫస్ట్ లుక్ లేదు టీజర్ కూడా రాలేదు. జస్ట్ రిలీజ్ డేట్ మరియు ఎప్పుడో వచ్చిన అనౌన్సమెంట్ పోస్టర్స్ మాత్రమే ఉన్నాయి. దీనితో అవన్నీ ఎప్పుడు మొదలవుతాయి అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పుడు మరో డిజప్పాయింటింగ్ టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ గాని ఇతర అప్డేట్స్ గాని మరింత ఆలస్యం అయ్యేలా ఉందట. ఎలా లేదన్నా మరో రెండు మూడు నెలల వరకు ఏ అప్డేట్ వచ్చే సూచనలు లేనట్టుగా తెలుస్తుంది. మరి మిగిలిన అన్ని రోజుల్లో అన్ని అప్డేట్స్ ప్రమోషన్స్ మేకర్స్ ఎలా మ్యానేజ్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు