మరో ఫస్ట్ ఎవర్ 1 మిలియన్ కి చేరువలో “భీమ్లా నాయక్”

Published on Sep 10, 2021 7:07 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “భీమ్లా నాయక్” కోసం అందరికీ తెలిసిందే.. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంని దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నాడు. మరి రానా దగ్గుబాటి కూడా నటిస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఏ అప్డేట్ కూడా ఎక్కడా డిజప్పాయింట్ చెయ్యలేదు. లేటెస్ట్ గా వచ్చిన ఫస్ట్ సింగిల్ అయితే మాస్ రికార్డ్స్ నే సెట్ చేసింది. పైగా ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్డ్ సాంగ్ గా కూడా రికార్డ్ సెట్ చేసింది.

అయితే దీనితో పాటుగా పవన్ ఖాతాలో మరో ఫస్ట్ ఎవర్ అదిరే రికార్డ్ పడేందుకు సిద్ధంగా ఉంది. అదే ఈ సినిమా గ్లిమ్ప్స్ తో.. దీనికి కూడా రిలీజ్ అయ్యాక టాలీవుడ్ నుంచి వచ్చిన ఏ వీడియో కి కూడా రాని భారీ రెస్పాన్స్ వచ్చింది. మరి ఇప్పుడు ఇది కూడా 1 మిలియన్ కి అతి చేరువలో ఉంది. ప్రస్తుతం 9 లక్షల 93 వేల లైక్స్ తో ఉన్న ఈ వీడియో 1 మిలియన్ దిశగా దూసుకెళ్తుంది. మరి ఒకవేళ ఇది కూడా కొడితే టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా లోనే ఫస్ట్ ఎవర్ 1 మిలియన్ లైక్డ్ గ్లిమ్ప్స్ గా నిలుస్తుంది. మరి ఈ మార్క్ ఎప్పుడు రీచ్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :