‘ఆర్ఆర్ఆర్’ కీర్తి కిరీటంలో మరొక కలికితురాయి

‘ఆర్ఆర్ఆర్’ కీర్తి కిరీటంలో మరొక కలికితురాయి

Published on Oct 29, 2022 2:45 AM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో రాజమౌళి తెరకెక్కించిన భారీ ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీంగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించారు. ఇక విడుదల తరువాత అందరి అంచనాలని మించేలా ఎంతో గొప్ప భారీ విజయం సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్, వందలాది కోట్ల రూపాయల కలెక్షన్ ని సొంతం చేసుకోవడంతో పాటు హాలీవుడ్ సహా అనేక దేశాల సినీ ఆడియన్స్ మనసు కూడా దోచుకుని వారి నుండి గొప్ప పేరు సొంతం చేసుకుంది.

ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ నిర్వహించారు ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్ సంస్థ ఎంపైర్ మ్యాగజైన్ వారు. అంతటి గొప్ప ప్రఖ్యాత పత్రికలో మన ఆర్ఆర్ఆర్ మూవీ గురించి ఎంతో గొప్పగా రాసారు. ముఖ్యంగా ఈ మూవీ యొక్క అనుభవాలతో పాటు తమకు ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ నుండి లభించిన ప్రశంసల గురించి రాజమౌళి ఎంతో గొప్పగా చెప్పారు. ఈ మూవీ కోసం తమ యూనిట్ లోని ప్రతి ఒక్కరు ఎంతో శ్రమించారని, ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ కి గ్లోబల్ గా ఇంత పెద్ద రీచ్ రావడం మాటల్లో వర్ణింపనలవి కాని ఆనందాన్ని ఇస్తోందని అన్నారు రాజమౌళి. మొత్తంగా ఈ విధంగా ఆర్ఆర్ఆర్ మూవీ యొక్క కీర్తి కిరీటంలో మరొక కలికితురాయి చేరిందని అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు