చరణ్ సినిమాలో మరో హీరోయిన్ !

రామ్‌చరణ్‌-బోయపాటి కాంబినేషన్లో రాబోతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. ‘భరత్ అనే నేను’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న కైరా అద్వానీ ఈ సినిమాలో చరణ్ సరసన నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్.

ఈ మూవీలో హీరోయిన్ స్నేహ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతోంది. ఆమె పాత్ర ఏంటి ? ఎలా ఉండబోతోంది అనేది తెలియాల్సి ఉంది. ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమా తరువాత స్నేహ నటిస్తోన్న సినిమా ఇదే అవ్వడం విశేషం. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్న లుక్స్ లో కనిపించబోతున్నాడని సమాచారం. అభిమానుల అంచనాలకు తగ్గకుండా ఈ సినిమా తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను.