‘జై లవ కుశ’ లో మరొక హీరోయిన్ !

21st, April 2017 - 08:49:13 AM


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘జై లవ కుశ’. దర్శకుడు బాబి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారని తెలియగానే ప్రేక్షకుల్లో, ఆయన అభిమానుల్లో అమితాసక్తి నెలకొంది. అంతేకాకుండా హాలీవుడ్, బాలీవుడ్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పనిచేస్తుండటంతో సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అనే అంచనాలు కూడా పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా గురించి తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇందులో మూడవ హీరోయిన్ కూడా ఉందట.

ఇప్పటికే రాశి ఖన్నా, నివేత థామస్ లు ఇండియాలో హీరోయిన్లుగా కుదరగా నందిత రాజ్ కూడా ఇందులో నటిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె పాత్ర తాలూకు సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తైపోయిందట. సినిమాలో ఈమెది చిన్న పాత్రే అయినప్పటికీ కథకు కీలకంగా, ప్రేక్షకులకు సప్రైజింగా ఉంటుందని, అందుకే ఆమె పాత్రను గోప్యంగా ఉంచారని సినీ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. తారక్ సోదరుడు కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో రిలీజ్ చేసేలా ప్రణాళికను సిద్ధం చేశారు.