‘పుష్ప 2’లో మరో హీరోయిన్.. ‘భన్వర్ సింగ్ షెఖావత్’కి సిస్టర్ !

Published on Jun 28, 2022 1:30 am IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడు. బన్నీ నటన చూసి సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఫిదా అయిపోయారు. అయితే ప్రస్తుతం పుష్ప 2 కోసం బన్నీ ఫుల్ బిజీగా ఉన్నాడు. కాగా తాజాగా పుష్ప 2 పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. పుష్ప 2 లో మరో హీరోయిన్ క్యారెక్టర్ ఉందట.

ఈ సినిమాలో భన్వర్ సింగ్ షెఖావత్ గా నటించిన ఫహాద్ ఫాజిల్ సిస్టర్ గా మరో హీరోయిన్ కనిపించబోతుందని.. బన్నీ – ఫహాద్ ఫాజిల్ మధ్యలో ఈ సిస్టర్ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఏది ఏమైనా ‘పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంది. పుష్పరాజ్ లాంటి పాత్రను స్టార్ హీరో చేసి మెప్పించడం చాలా రిస్క్. బన్నీ ఆ రిస్క్ ను బాగా హ్యాండిల్ చేశాడు. అందుకే పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :