“RRR” పై మరో హాలీవుడ్ సెలెబ్రెటీ ఇంట్రెస్టింగ్ పోస్ట్.!

Published on Jun 16, 2022 1:20 pm IST


ఇప్పుడు మన తెలుగు ప్రౌడ్ సినిమా అయినటువంటి “రౌద్రం రణం రుధిరం” చిత్రం ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కో రోజుకి అంతకంతకూ విదేశపు ఆడియెన్స్ లో భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. ముఖ్యంగా అయితే జెనరల్ ఆడియెన్స్ తో పాటుగా అనేక హాలీవుడ్ సినిమాలు అందులోని పలు భారీ చిత్రాల రచయితలు, నిర్మాతలు RRR చూసాక తన ఎగ్జైటింగ్ రెస్పాన్స్ ని తెలపడమే కాకుండా తమ సన్నిహితులకు కూడా సజెస్ట్ చేస్తున్నారు.

మరి ఇప్పుడు లేటెస్ట్ గా “ది పసిఫిక్ రిమ్ 2”, “ది 100”, “యురేకా” వంటి చిత్రాలకు రచయితా, నిర్మాత కీరా స్నైడర్ RRR లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లపై చిరుత, పులి షాట్స్ పై ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఈ సినిమాలో ప్రతి సీన్ కూడా అమేజింగ్ గా ఉన్నాయి అని మాటలు ఈ సినిమాని జస్టిఫై చెయ్యలేవు జస్ట్ మీ ఫ్రెండ్స్ తో కలిసి ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చెయ్యండి అని పోస్ట్ చేయడం ఇది వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :