“హరి హర వీరమల్లు” లో మరో భారీ సెట్ కి రంగం సిద్ధం.?

Published on Jan 20, 2022 4:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న మొట్ట మొదటి పాన్ ఇండియన్ సినిమా “హరిహర వీరమల్లు”. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్ల ముడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై పవన్ అభిమానుల్లో నెక్స్ట్ లెవెల్ అంచనాలు కూడా ఉన్నాయి.

అయితే ఇది వరకు వచ్చిన పోస్టర్స్ గ్లింప్స్ లలో ఈ సినిమా ఎంత గ్రాండ్ గా ఉంటుంది అనేది కూడా అర్ధం అయ్యింది. అలాగే ఈ సినిమాలో భారతదేశానికి చెందిన పురాతన సెట్టింగ్ లు వేస్తున్నారని కూడా తెలిసిందే. ఇప్పటికే అలాంటి సెట్స్ లో కీలక సన్నివేశాలను తీసిన మేకర్స్ ఇప్పుడు ఇంకో భారీ సెట్టింగ్ కి వెయ్యడానికి రంగం సిద్ధం చేస్తున్నారట.

అది కూడా 17వ శతాబ్దం నాటి చాందిని చౌక్ సెట్టింగ్ అన్నట్టు తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఈ సెట్టింగ్స్ లో షూటింగ్ జరగనుందట. దీనిని కూడా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి నే దగ్గరుండి చేయిస్తున్నారని తెలుస్తుంది. మరి విజువల్ గా ఇదెలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :