“బలగం” కి అదిరిపోయిన రెస్పాన్స్!

Published on Mar 15, 2023 4:30 pm IST

బలగం చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. హాస్యనటుడు వేణు యెల్దండి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రలు పోషించారు. విలేజ్ డ్రామా గొప్ప మౌత్ టాక్ ద్వారా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. డ్రీమ్ రన్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పుడు మరో అపురూపమైన ఫీట్ సాధించింది.

నిన్న అంటే, 12వ రోజున, ఈ చిత్రం అత్యధిక వర్కింగ్ డే కలెక్షన్లను నమోదు చేసింది. విలేజ్ డ్రామా అద్భుత విజయం సాధించినందుకు టీమ్ చాలా ఆనందంగా ఉంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డిలు బలగం చిత్రం ను నిర్మించారు. ధమాకా ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. వేణు యెల్దండి, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రాచ రవి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం :