“పుష్ప” చూసాక మరో ఇండియన్ క్రికెటర్ మాస్ రెస్పాన్స్.!

Published on Jan 8, 2022 3:03 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ “పుష్ప ది రైజ్” వస్తున్న సాలిడ్ ఫీడ్ బ్యాక్ ఇంకా ఆగలేదు. తెలుగు ఆడియెన్స్ నుంచే కాకుండా పెద్ద ఎత్తున హిందీ ఆడియెన్స్ మరియు యాక్టర్స్ క్రికెటర్స్ నుంచి భారీ రెస్పాన్స్ ఈ సినిమా అందుకుంది. ఈ సినిమా చూసాక మాత్రం వారు ఎవరూ కూడా తమ స్పందనను చెప్పకుండా ఉండలేకపోతున్నారు.

అలాగే గత కొన్ని రోజులు కితమే మన దేశపు ప్రముఖ క్రికెటర్లు అంబటి రాయుడు, హనుమా విహరిలు తమ స్పందనను తెలియజేసారు. ఇంకా జడేజా అయితే పుష్ప రీల్ కూడా చేసి వైరల్ అయ్యాడు. ఇక ఇప్పుడు వీరితో మరో ప్రముఖ ఇండియన్ క్రికెటర్ ప్రగ్యాన్ ఓజాహ్ పుష్ప సినిమా చూసిన తర్వాత తన మాస్ రెస్పాన్స్ ని తెలిపాడు. దీనితో తన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

“ఒకప్పుడు ఒక బ్లాక్ బస్టర్ డైలాగ్ ఉండేది పుష్ప… ఐ హేట్ టియర్స్ అని కానీ ఇప్పుడు పుష్పా పుష్ప రాజ్.. నీయవ్వ తగ్గేదేలే” అని ఈ డైలాగ్ చెప్పి అల్లు అర్జున్ వర్క్ ఈ సినిమాకి అదిరిపోయింది అని తెలిపాడు. మొత్తానికి మాత్రం పుష్ప రెస్పాన్స్ ఇప్పుడప్పుడే తగ్గేదేలే..

సంబంధిత సమాచారం :