“ఆదిపురుష్” షూట్ పై మరో ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Sep 18, 2021 2:00 pm IST

పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా దర్శకుడు ఓంరౌత్ కాంబోలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. ఎనలేని అంచనాలు నెలకొల్పుకున్నా ఈ ప్రాజెక్ట్ అప్పుడు లాక్ డౌన్ అనంతరం షురూ అయ్యి శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. మరి ఇదిలా ఉండగా ప్రభాస్ ఈరోజు నుంచి ఈ సినిమాలో ఓ భారీ యాక్షన్ సన్నివేశం నిమిత్తం సన్నద్ధం అయ్యాడని తెలిసిందే.

మరి దీనిపై మరింత సమాచారం వినిపిస్తుంది. బహుశా ఇదే షెడ్యూల్ ఈ సినిమాలో ఫైనల్ ది అన్నట్టు తెలుస్తుంది. ఇది కంప్లీట్ అయితే సినిమా మెయిన్ పోర్షన్ కంప్లీట్ అయ్యినట్టే అట. అలాగే వచ్చే అక్టోబర్ మూడో వారం వరకు కూడా ఇది కొనసాగనున్నట్టు తెలుస్తుంది. మరి రామాయణ మహాకావ్యం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ రావణ పాత్రలో నటిస్తుండగా ఈ భారీ విజువల్ వండర్ వచ్చే ఏడాది ఆగష్టు లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :