“సర్కారు వారి పాట” ఈ సీక్వెన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ బజ్!

Published on Mar 11, 2022 9:00 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సాలిడ్ చిత్రం “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని మేకర్స్ సాలిడ్ ఎలిమెంట్స్ తోనే తెరకెక్కిస్తున్నారు. అయితే లేటెస్ట్ గా ఈ అదిరే యాక్షన్ సీక్వెన్స్ షూట్ ని మేకర్స్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో తెరకెక్కిస్తున్నారని తెలిసిందే.

ఇప్పుడు ఈ సీక్వెన్స్ పైనే మరో ఇంట్రెస్టింగ్ డీటెయిల్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ సీన్ సినిమాలో విలన్ గా చేస్తున్నటువంటి సముద్రఖని మనుషులకి మరియు మహేష్ బాబుకి మధ్యలో ఉంటుందట. దీన్ని కూడా నెవర్ బిఫోర్ మ్యానర్ యాక్షన్ లోనే తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ స్టన్నింగ్ సీక్వెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :