“సర్కారు వారి పాట” రిలీజ్ పై మరో ఇంట్రెస్టింగ్ బజ్..!

Published on Mar 12, 2022 4:00 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి గత కొన్ని రోజులుగా పలు ఆసక్తిగకర ఊహాగానాలే వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిపై మరింత క్లారిటీ వినిపిస్తుంది. బహుశా పాన్ ఇండియా రేంజ్ లోనే సినిమా రిలీజ్ ఉండొచ్చు… అని పక్కన పెడితే దాదాపు అయితే సౌత్ లోని అన్ని ముఖ్య భాషల్లో ఈ సినిమా రిలీజ్ ఉండొచ్చని తెలుస్తుంది.

ఇప్పటికే తమిళ్ రిలీజ్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది. దీనితో మిగతా భాషలపై కూడా మేకర్స్ పరిశీలనలో ఉన్నారట. అయితే మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా హిందీ రిలీజ్ కోసం ఎక్కువగా కోరుకుంటున్నారు. మరి చూడాలి ఈ సినిమా రిలీజ్ ప్లాన్ ఎలా ఉంటుందో అనేది.

సంబంధిత సమాచారం :